కాకతీయ, గీసుగొండ : మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన అనుచరులు కాంగ్రెస్ నాయకులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, కార్యకర్తల అభిమాన నాయకుడు కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలకు తరలివచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా కొండా దంపతులు అండగా ఉంటారని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వీరగోని రాజ్ కుమార్, రడం భరత్ కుమార్, అల్లం మర్రెడ్డి, మాజీ సర్పంచులు డోలె చిన్ని, కోల కుమార స్వామి, దౌడు బాబు, సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, మాజీ ఎంపీటీసీలు బేతినేని వీరా రావు, కాగిత భిక్షపతి, నాయకులు కోల్పుల కట్టయ్య, దౌడు సునీల్,పేర్ల శ్రవణ్, మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు.


