సందడిగా ‘కొండా’ జన్మదిన వేడుకలు
కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలా వరంగల్ మండల కేంద్రములోని అనాథ ఆశ్రమంలో మాజీ ఎమ్సీ డైరెక్టర్ చందర్, దడపెల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, వెజిటబుల్ బిర్యాని పంచారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, అరసం రాంబాబు, వనపర్తి కరుణాకర్, మేకల కిషోర్, సుధాకర్, రాజేష్, హరేందర్ తదితరులు పాల్గొన్నారు.


