ఖబర్దార్ రాధాకృష్ణ! భట్టి పై వ్యాఖ్యలు మానుకోండి
భద్రాద్రి కొత్తగూడెం ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు
కాకతీయ, జూలూరుపాడు : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఎండీ రాధాకృష్ణ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై చేసిన అనుచిత వ్యాఖ్యలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు మాట్లాడుతూ— తెలంగాణ ప్రజలు గౌరవించే సీనియర్ నాయకుడిపై అవగాహనలేని, దిగజారిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలు జర్నలిజం కాదని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సహించదన్నారు. వెంటనే ఏబీఎన్ యాజమాన్యం స్పందించి వివరణ ఇవ్వాలని, లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా తగిన పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛ పేరుతో దుష్ప్రచారం అనుమతించబోమని స్పష్టం చేశారు.


