మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్
కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అమన్‌ప్రీత్‌ను కేసులో ఏ–7గా చేర్చారు. డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో అమన్‌ప్రీత్‌తో పాటు మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19న నితిన్ సింగానియా, శ్రానిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నితిన్, శ్రానిక్‌ల నుంచి అమన్‌ప్రీత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయని వెల్లడించారు. అమన్‌ప్రీత్ గతంలోనూ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. త్వరలోనే కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు


