మేడారం జాతర కీలక ఘట్టాలు
నాలుగు రోజులు.. ఆధ్యాత్మిక ఉత్సవం
అమ్మవార్ల రాక–తిరుగు ప్రయాణమే ప్రధాన ఆకర్షణ
కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతరలోని కీలక ఘట్టాలకు గడియాలు ఆసన్నమయ్యాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో ప్రతి రోజూ ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన ఘట్టాలు ఉన్నాయి.
మొదటి రోజు (జనవరి 28) : సాయంత్రం 6 గంటలకు శ్రీ సారలమ్మ అమ్మవారు, శ్రీ గోవిందరాజు, పగిడిద్ద రాజులు గద్దెలపైకి రానున్నారు. జాతరకు ఇదే అధికారిక ఆరంభంగా భావిస్తారు.
రెండో రోజు (జనవరి 29) : సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క అమ్మవారు గద్దెలకు చేరుకుంటారు. ఈ ఘట్టాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
మూడో రోజు (జనవరి 30) : భక్తులు మొక్కుబడులు తీర్చుకొని, అమ్మవార్లకు ప్రత్యేక ప్రార్థనలు చేసే ప్రధాన రోజు.
నాలుగో రోజు (జనవరి 31) : సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క, శ్రీ సారలమ్మ అమ్మవార్లు, శ్రీ గోవిందరాజు, పగిడిద్ద రాజులు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. దీనితో మహాజాతర ముగుస్తుంది.


