కాకతీయ, నేషనల్ డెస్క్: కేరళ కాంగ్రెస్ లో ఓ హీరోయిన్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. దీంతో ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుు రాహుల్ మామకుటత్తిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదూర్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
ఓ ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని..మూడు సంవత్సరాలుగా వేధిస్తున్నారంటూ రీని జార్జ్ అనే నటి ఓ ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆపార్టీ సీనియర్ల ద్రుష్టికి తీసుకెళ్లినా..ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. రాహుల్ పేరును ఆమె నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ బీజేపీ, సీపీఎం శ్రేణులు ఆయన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. రాజీనామా చేయాలని నిరసనలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై పార్టీలో అంతర్గత విచారణ చేపట్టినట్లు దోషులు తప్పించుకోలేరని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ తెలిపారు.
ఈ పరిణామాల నడుమ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. నాపై వచ్చిన ఆరోపణల విషయంలో పార్టీ పెద్దలతో ఆయన మాట్లాడాను. వారెవరూ నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదన్నారు. ఆ నటి నా స్నేహితురాలని తెలిపారు. ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తి నేను కాదని నమ్ముతున్నాను అని ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు.


