మాజీమంత్రి హరీష్‌రావుకు కేసీఆర్ పరామర్శ
కాకతీయ, హైదరాబాద్ సిటీ బ్యూరో : తన బావమరిది అయిన సత్యనారాయణ మరణంపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసానికి వెళ్లి, సత్యనారాయణ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులర్పించారు. అలాగే హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. బావ సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని ఈసందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, హరీష్ రావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.




