కాకతీయ, నర్మెట్ట: ఎంపీడీవోగా కావ్య శ్రీనివాసన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్–1లో ప్రతిభతో ఎంపికై ఏడు రోజుల శిక్షణ పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వం తాజాగా మండలాల వారీగా పోస్టింగ్‌లు జారీ చేస్తూ నర్మెట్టకు ఆమెను నియమించింది. అధికారికంగా బాధ్యతలు చేపట్టి మండల కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. గ్రామీణ ప్రగతి, ప్రజల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు


