కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తీర్పు తెలంగాణ పల్లెల్లో మరోసారి రాబోతోందని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతానికంటే భిన్నంగా ఈసారి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామని అన్నారు. అందులో భాగంగా 18ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ ఇందిరా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలు పంపిణీ చేస్తున్నామని, వాటిని తీసుకున్న మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఇలాంటి నాణ్యమైన చీరలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్,ఈటల రాజేందర్ ఒకరినొకరు మాట్లాడుకోవడం కాదని హుజూరాబాద్ అభివృద్ధికి సహకరించాలని ప్రణవ్ కోరారు. రైతుల విషయంలో బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నారని చిత్తశుద్ధి ఉన్న పార్టీగా బోనస్ ఇచ్చామని అన్నారు. ఇద్దరు ఎంపీలుగా ఉండి హుజూరాబాద్ అభివృద్ధికి ఏం చేశారో తెలుపాలని,మతం పేరు చెప్పి రాజకీయాలు చేయడం కాదని దేవుడంటే అందరికి భక్తి అని అన్నారు.


