- రీల్స్ చేయడం మానుకుని.. రియల్ లోకి రావాలి
- అభివృద్ధే పరమావధిగా కాంగ్రెస్
- బోగస్ మాటలతో బీఆర్ఎస్ ప్రచారం
- జూబ్లీహిల్స్ వేదికగా హుజూరాబాద్ పరువు తీస్తున్న కౌశిక్ రెడ్డి
- హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్ : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హుజూరాబాద్ నియోజవర్గ పరువు తీస్తున్నాడని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజురాబాద్ సంబంధించిన వ్యక్తులతో చిట్ చాట్ కార్యక్రమం పెట్టి, లేని వ్యక్తులను జూబ్లీహిల్స్ లో ఉన్నట్టుగా బోగస్ ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. ప్రచారం చేయాలి కానీ మరి రాజకీయాల్లో ఇంత దిగజారుడు రాజకీయం పనికిరాదని ప్రణవ్ హితవు పలికారు. జూబ్లీహిల్స్ లో యువత నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటిస్తూ ఆయన సోషల్ మీడియానే చెబుతోందని ఇది చూసైన కౌశిక్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. హుజురాబాద్ వేదికగా చస్తా అని బ్లాక్ మెయిల్ రాజకీయాలు జూబ్లీహిల్స్ లో పని చేయవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


