epaper
Saturday, November 15, 2025
epaper

ప్రమాదాలకు అడ్డగా కటాక్షపూర్ మత్తడి…

ప్రమాదాలకు అడ్డంగా కటాక్షపూర్ మత్తడి..!

జాతీయ రహదారి 163 పై ప్రయాణం ప్రాణపణంగా మారిన దుస్థితి

– గుంతలతో నిండిన రహదారి – వాహనదారుల దుర్భర యాతన
– వంతెన పనులు నత్తనడక – వర్షంలో నీటితో మునిగే మత్తడి
– రాత్రివేళల్లో వెలుతురు లేక ప్రమాదాల ముప్పు పెరుగుదల
– కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల మౌనం – ప్రజల్లో ఆగ్రహం

కాకతీయ, ఆత్మకూర్ :

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి ప్రస్తుతం ప్రజలకు శాపంగా మారింది. ఈ ప్రాంతం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 163 (హనుమకొండ – ములుగు) పై భారీ గుంతలు, అసమతుల్య రోడ్డు, నీటి నిల్వలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం రాగానే రహదారి మధ్యలో పెద్ద గుంతలు చెరువుల్లా మారిపోతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, లారీలు ఈ ప్రాంతం దాటాలంటే రిస్క్ తప్పదు. రాత్రివేళల్లో కాంతి సరిగా అందకపోవడంతో గుంతల్లో పడిపోవడం, వాహనాలు ఇరుక్కుపోవడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.

హై లెవల్ వంతెన పనులు నిలిచిపోయి నెలలు గడిచాయి..

కటాక్షపూర్ పెద్ద చెరువు వద్ద జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హై లెవల్ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. కానీ పనులు నత్తనడకన సాగి, చివరికి ఆగిపోయాయి. ఫలితంగా మత్తడి మార్గం ఇప్పటికీ తెరచాప మీదే ఉంది. నిమ్మకు నీరెత్తినట్టు పనులు చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. స్థానిక రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ ఈ రూట్ మీదే వెళ్ళాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన పూర్తయి ఉంటే మత్తడి సమస్య ఉండేది కాదు. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇప్పటికీ అదే దుస్థితి కొనసాగుతోంది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రమాదాలు పెరుగుతున్నాయి..

జాతీయ రహదారి విభాగం, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు స్థల పరిశీలన చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. పలు సార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన రాలేదని వారు ఆరోపిస్తున్నారు. మత్తడి దాటాలంటే భయమే వేస్తోంది. గుంతల్లో పడిపోతామోమో అనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి అని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజల డిమాండ్లు..

కటాక్షపూర్ మత్తడి వద్ద రోడ్డు మరమ్మత్తు పనులు తక్షణమే ప్రారంభించాలి. హై లెవల్ వంతెన నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి. రాత్రివేళల్లో లైటింగ్ సదుపాయం కల్పించాలి. రహదారి పక్కన హెచ్చరిక బోర్డులు, భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలి అని స్థానికులు అంటున్న మాట. కటాక్షపూర్ మత్తడి మరిస్తే ప్రమాదాలు పెరుగుతాయి అని, రోడ్డు సరిగా ఉంటే వాహనదారులకు ఊరట లభిస్తుంది అంటూ, వెంటనే చర్యలు తీసుకోకపోతే మత్తడి మరిన్ని ప్రాణ నష్టాలకు వేదికవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సీరియస్‌గా స్పందించి రహదారి పరిస్థితి మెరుగుపరచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img