కాకతీయ, నేషనల్ డెస్క్: తమిళ నటుడు, తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ శనివారం కరూర్ లో రోడ్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోడ్ షోలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 39 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
క్షతగాత్రులను తమిళనాడు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే అధినేత విజయ్ ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మ్రుతుల కుటుంబాలకు రూ. 20లక్సల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 2లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. బాధితులకు అండగా నిలుస్తామని టీవీకే అధినేత విజయ్ పేర్కొన్నారు.


