కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలానికి నూతనంగా పోలీస్ స్టేషన్ కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ప్రకటించగా ఎస్సైగా జి.కరుణాకర్ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 28న చార్జ్ తీసుకోగా బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు అందరు సహకరిస్తూ సమన్వయంతో ఉండాలని ఎస్ఐ సూచించారు.


