కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లిక్ స్కూల్ లో ముందస్తు కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు దీపాలు వెలిగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వేణుమాధవ్ మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు, పండగ విశిష్టత విద్యార్థులకు తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముంజాల సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.


