ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర నవగ్రహ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.వేకువ జాము నుండే భక్తులు భారీగా తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు శివలింగానికి పాలు, జలాభిషేకాలు చేస్తూ భక్తిని చాటుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకుడు దేవేంద్రశర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం,దీపోత్సవం నిర్వహించారు.కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.


