భగత్‌నగర్ శివాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.
కాకతీయ, కరీంనగర్ భగత్ నగర్ : కరీంనగర్ నగరంలోని 33వ డివిజన్ భగత్‌నగర్ శివాలయంలో బుధవారం ఉదయం నుంచి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతుండగా. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి, పూజలు, అభిషేకాలు నిర్వహించారు.”ఓం నమః శివాయ” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు శివలింగానికి పాలు, జలాభిషేకాలు చేస్తూ భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. ఆలయ అర్చకుల నేతృత్వంలో రుద్రాభిషేకం, రుద్రహోమం, దీపోత్సవం నిర్వహించగా, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


