కాకతీయ, మహాదేవపూర్ : దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళేశ్వరా ముక్తీశ్వరాలయంలో కార్తీక శోభ నెలకొంది. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో ఆలయంలో భక్తులు మూడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు లక్ష దీపాలు వెలిగించి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదలు స్వీకరించారు.


