బీజేపీకి కార్తీక్ గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిక
గంగుల సమక్షంలో అధికారిక చేరిక
21వ డివిజన్ ఇన్‌చార్జి పార్టీ మార్పు
కాకతీయ, కరీంనగర్: 21వ డివిజన్ బీజేపీ ఇన్‌చార్జిగా ఉన్న ముడుంబై కార్తీక్ బీజేపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. మంగళవారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో ఆయన అధికారికంగా చేరిక ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి కార్తీక్‌ను ఆహ్వానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


