కరీంనగర్ యువ నాయకుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి యూనిటీ మార్చ్‌లో ఎంపిక
కాకతీయ, కరీంనగర్ : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా, యువ ప్రతినిధులతో వారం రోజుల పాదయాత్ర “యూనిటీ మార్చ్” ఈ నెల 23 నుంచి 30 వరకు జరుగుతుంది.ఈ కార్యక్రమానికి హుజురాబాద్ మండలం, చిన్నపాపయ్య పల్లెకు చెందిన యువ నాయకుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఎంపికయ్యాడు. విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమించి, ప్రస్తుతం యువమోర్చాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రవీణ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు.23న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి ప్రారంభమయ్యే యాత్ర నాగపూర్, ఇండోర్ మార్గం దాటుతూ గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వద్ద వేలాది మంది పాల్గొని ముగుస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ముక్కలుగా ఉన్న దేశాన్ని 562 సంస్థానాలతో ఏకీకృతం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని తీసుకొని దేశం ఐక్యతగా ఉండాలన్న సందేశం ఈ యాత్ర ద్వారా ప్రేరేపించబడుతుంది.ముగింపు కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఐక్యత సందేశాన్ని దేశ ప్రజలకు అందిస్తారు.ప్రవీణ్ రెడ్డి భారత ప్రభుత్వం మరియు కరీంనగర్ జిల్లా నాయకుల అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.


