కాకతీయ, కరీంనగర్: గణేష్ నిమజ్జనం సందర్భంగా, సెప్టెంబర్ 05, 2025న కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలిసులు ప్రకటించారు. ప్రజలు, వాహనదారులు ఈ మళ్లింపులకు సహకరించి ప్రయాణ సౌలభ్యాన్ని పాటించాల్సిందిగా కొరారు. హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు మానకొండూర్ పల్లె బస్టాండ్ నుంచి ముంజంపల్లి, పోరండ్ల వైపు మళ్లిస్తారు. తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రోడ్డుకు చేరుకుని అక్కడి నుంచి కరీంనగర్‌కు వెళ్లవచ్చు.
నిమజ్జనం తర్వాత తిరిగి వెళ్లే వాహనాలు ముంజంపల్లి, పోరండ్ల మీదుగా తిమ్మాపూర్‌కు చేరుకుని, అక్కడి నుంచి కరీంనగర్‌కు వెళ్లాలి.
కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి మళ్లింపులు ఉండవు. అవి యథావిధిగా తమ మార్గంలో ప్రయాణించవచ్చు. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలను వెలిచాల ఎక్స్ రోడ్డు వద్ద మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్ ఎక్స్ రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుంచి కరీంనగర్ పట్టణానికి మళ్లిస్తారు.
(అవసరమైతే) కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్లే వాహనాలకు అవసరమైనప్పుడు రేకుర్తి జంక్షన్ వద్ద యూనివర్సిటీ ఎక్స్ రోడ్డు, మల్కాపూర్ వైపు మళ్లించి, వెలిచల ఎక్స్ రోడ్డు వద్ద జగిత్యాల రోడ్డుకు చేరుకుంటారు.
నిమజ్జనం పాయింట్ల వద్ద:
చింతకుంట, కొత్తపల్లి నిమజ్జనం తర్వాత, ఈ పాయింట్ల వద్దకు వచ్చిన వాహనాలు ‘యూ’ టర్న్ తీసుకుని అదే మార్గంలో కరీంనగర్‌కు తిరిగి వెళ్లాలి. అలాగే సెప్టెంబర్ 05, 2025 నుంచి సెప్టెంబర్ 06, 2025 తేదీ వరకు గ్రానైట్, ఇతర భారీ సరుకు రవాణా వాహనాలను అనుమతించరని ఈ నిబంధనలను తప్పక పాటించాలని పోలిసులు స్పష్టం చేశారు.


