- శబరి పాదయాత్రలో 700 కిలోమీటర్ల నడక పూర్తి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నుంచి శబరిమలకు పాదయాత్రగా బయల్దేరిన స్వాముల బృందం గురువారం కర్ణాటకలో అడుగుపెట్టింది. కరీంనగర్ నుంచి బయల్దేరిన స్వాముల బృందం ఇప్పటివరకు 700 కిలోమీటర్ల నడక పూర్తి చేసిందని, ఈ నెల 26న శబరిమల చేరుకుంటుందని గురుస్వామి హరీష్ తెలిపారు. మొత్తం 1450 కిలోమీటర్లు నాలుగు రాష్ట్రాల మీదుగా నడక కొనసాగుతోందని ఈ యాత్ర గడప నాగరాజు గురుస్వామి తెలిపారు. మొత్తం 80మంది అయ్యప్ప స్వాములు నియమ నిష్ఠలతో కొనసాగిస్తున్నారు. ప్రతి అడుగు శబరిమల వైపు నినాదంతో భక్తి తరంగాల మధ్య యాత్ర ముందుకు సాగుతోంది


