కరీంనగర్ 10వ తరగతి మూల్యాంకనం పేపర్ల వివాదం
సూపరింటెండెంట్ నరసింహ స్వామి సస్పెన్షన్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా విద్యాశాఖలో 10వ తరగతి మూల్యాంకనం పేపర్లు అమ్మకాలు, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అప్పటి ఏసీజీఈ, ప్రస్తుత సూపరింటెండెంట్ నరసింహ స్వామి సస్పెండ్ అయ్యారు. వివాదాస్పద వార్తలు పత్రికల్లో వెలువడిన నేపథ్యంలో శాఖాపరమైన విచారణ చేపట్టి వరంగల్ ఆర్ జేడీ ఆదేశాల ప్రకారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.


