epaper
Sunday, March 8, 2026
epaper

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!
కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం
సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) మృతి
పిల్లల తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మరో ఘటనలో ఇద్దరు బాలురు మిస్సింగ్
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
కామారెడ్డిలో కలకలం రేపుతున్న చిన్నారుల అదృశ్యాలు

కాకతీయ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఘటన విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఇద్దరి మృతదేహాలు పట్టణంలోని పెద్ద చెరువులో లభించడంతో జిల్లా వ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. మరో చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తెలు సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) శనివారం ఉదయం కనిపించకుండా పోయారు. ఉదయం తమ తండ్రితో కలిసి దుకాణానికి వెళ్లిన ఈ ముగ్గురు పిల్లలు తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గాలింపు సమయంలో పట్టణంలోని పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. మూడో చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు కలిసి చెరువులో గాలింపు కొనసాగిస్తున్నారు.

తండ్రి విచారణలో

ఈ ఘటనపై అనుమానాస్పద పరిస్థితులు ఉండటంతో పిల్లల తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కామారెడ్డిలో గత రెండు రోజులుగా చిన్నారుల అదృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శుక్రవారం గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), విజయ్ (9) అనే ఇద్దరు బాలురు కూడా కనిపించకుండా పోయారు. వారి కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వరుసగా చిన్నారులు కనిపించకుండా పోవడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ ఘటనలతో కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నారుల అదృశ్యాలపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సివిల్స్‌లో మెరిసిన యువత..!

సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల...

గణపతి లొంగుబాటు..!

గణపతి లొంగుబాటు..! అజ్ఞాత జీవితం వీడిన మావోయిస్టు అగ్రనేత నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు...

ఒక్క టీకా… ఆడ‌బిడ్డ ప్రాణానికి ర‌క్ష‌

ఒక్క టీకా… ఆడ‌బిడ్డ ప్రాణానికి ర‌క్ష‌ హెచ్‌పీవీ టీకాతో క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా...

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు కోర్టు కేసులున్నా నిర్మాణాలు ప్రగతినగర్...

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు కుటుంబ...

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ గాంధీ కుటుంబానికి సంబంధించిన పెయిటింగ్‌ను జ్ఞాపిక‌గా...

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img