కాకతీయ, తెలంగాణ బ్యూరో: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ వాయిదా పడింది. ఈ నెల 15న నిర్వహించాలనుకున్న సభను వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది.
పీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ .. “భారీ వర్ష సూచనలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 15న జరగాల్సిన కామారెడ్డి బహిరంగ సభను వాయిదా వేస్తున్నాం. తిరిగి ఎప్పుడు నిర్వహించాలో త్వరలో తెలియజేస్తాం” అని తెలిపారు.
ఈ సభలో పలు కీలక అంశాలు చర్చించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశముందని పార్టీ అంచనా వేసింది. అయితే, అనుకూలం కాని వాతావరణ పరిస్థితులు ఉండటంతో ప్రజల సౌకర్యార్థం సభ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. తాజా తేదీ త్వరలో ప్రకటించబడుతుందని, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరలా పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.


