epaper
Tuesday, March 10, 2026
epaper

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’
సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు
ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు
ఆరు మండలాలకు రూ.3.05 కోట్ల చెక్కుల పంపిణీ
న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

కాకతీయ, నర్సంపేట టౌన్ : ప్రజా ప్రభుత్వ పాలనలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి స్పష్టం చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా చేయడమే లక్ష్యంగా ‘కళ్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ క్లబ్‌లో ఆరు మండలాలకు చెందిన 305 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల 5 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మాధవ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వంలో సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తోందని, ఆర్థిక భారమున్నా సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా జాప్యం లేదని తెలిపారు.

ప్రభుత్వం అండగా నిలుస్తుంది
పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఎవరూ దళారులను నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించి కుటుంబాలపై భారం తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమానంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, వివిధ మండలాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి..

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు కాకతీయ,గీసుగొండ:కొమ్మాల గుడి...

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు శంక‌రా నేత్ర వైద్య‌శాల‌, రుద్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో...

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి 12 శాతం వడ్డీని ర‌ద్దు చేయాలి ములుగు...

ఆరోగ్యం కోసమే 5 కే రన్

ఆరోగ్యం కోసమే 5 కే రన్ ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే అభివృద్ధి నగర మేయర్...

విన్నపాలు విడిచి

విన్నపాలు విడిచి పన్నుల వేట! వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ .. పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు ఆఫీస‌ర్ల...

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని కాకతీయ, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన వేం...

బీజేపీతోనే నగరాభివృద్ధి

బీజేపీతోనే నగరాభివృద్ధి వరంగల్ అభివృద్ధిపై కేంద్రం నజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడం...

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌ కాకతీయ, నర్సంపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img