కాకతీయ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో కల్లు గీత కార్మిక సంఘం ఐదో మండల మహాసభ సమావేశం మంగళవారం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యమగాని వెంకన్న, గౌని వెంకన్న హాజరై మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా డొనికెని రామన్న, ప్రధాన కార్యదర్శిగా చిర్ర సతీష్, ఉపాధ్యాక్షుడిగా గుండగాని వెంకన్న, కోశాధికారిగా దొంతు రాంముర్తి, సహాయక కార్యదర్శిగా చలమల్ల వెంకన్న, గౌరవ అధ్యక్షులుగా చలమల్లయాదగిరి, సోషల్ మీడియా కన్వీనర్గా కోల యాకయ్యలను ఏకగ్రీవంగా ఎన్నికున్నట్లు తెలిపారు. అనంతరం నూతన కల్లుగీత కార్మిక సంఘ అధ్యక్షుడు డొనికెన రామన్న మాట్లాడుతూ తనను ఎన్నికకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారు గునిగంటి మోహన్, గౌడకుల అధ్యక్షుడు డొనికెనజంపన్న, సీతారాములు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


