కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం అంశంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మీతా సభర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది.
కాళేశ్వరం అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును స్మితా సభర్వాల్ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. నోటీసులు జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన ఆమె.. ఆ రిపోర్టును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిపోర్టు ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు..జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సభర్వాల్ పై చర్యలు తీసుకోవద్దంటూ స్పష్టం చేసింది.


