ప్రజల పక్షాన నిలుస్తున్న కాకతీయ
: ఐనవోలు తహసీల్దార్ విక్రమ్‌కుమార్
కాకతీయ, వరంగల్ సిటీ : ఐనవోలు తహసిల్దార్ విక్రమ్ శుక్రవారం తన కార్యాలయంలో కాకతీయ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ కాలంలోనే అవినీతి, అక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రజల పక్షాన నిలబడిన ధైర్యవంతమైన పత్రికగా కాకతీయ గుర్తింపు పొందిందని అన్నారు. ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి పత్రికా రంగంలో ముందంజలో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కాకతీయ ప్రతినిధి బండి రామారావు, వరంగల్ సిటీ రిపోర్టర్ కడుప అశోక్ కుమార్, కిలా వరంగల్ రిపోర్టర్ అమర్ వర్మ పాల్గొన్నారు.


