ఘనంగా కాకతీయ పెరిక పరపతి సంఘం వార్షికోత్సవం
ఖిలా వరంగల్‌లో కుల ఐక్యతకు ప్రతీకగా సభ
సేవలందించిన పెఱిక కులస్థులకు ఘన సన్మానం
కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ తూర్పు కోటాలో కాకతీయ పెఱిక పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, కుల పెద్దలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న పెఱిక కులస్థులను సంఘం ఘనంగా సన్మానించింది. మాజీ డిప్యూటీ మేయర్ కక్కే సారయ్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు కుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్ భగీరత్ మాట్లాడుతూ పెఱిక కులాన్ని సంఖ్య పరంగా చిన్నదిగా చూడవద్దని, అన్ని రంగాల్లో కులస్థులు విశేషంగా ముందంజలో ఉన్నారని అన్నారు. తన వద్దకు వచ్చే పెఱిక కులస్థులకు ఉచిత సేవలు అందిస్తానని ప్రకటించారు. సంఘ వార్షిక బడ్జెట్‌ను అధ్యక్షుడు రాంబాబు ప్రవేశపెట్టారు. పెఱిక కుల అభివృద్ధే సంఘం ప్రధాన లక్ష్యమని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యాచరణకు ఈ వార్షికోత్సవ సభ దిశానిర్దేశం చేసిందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా పెఱిక కుల అధ్యక్షుడు అల్లం రాజేష్ వర్మ, మాజీ అధ్యక్షుడు చింతం ప్రవీణ్, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, బోగి సువర్ణ సురేష్, ప్రధాన కార్యదర్శి కందిమల్ల మహేష్, ఉపాధ్యక్షులు మెడిశెట్టి రాజేష్, అంకతి పరమేశ్వర్, సహకార్యదర్శి బండి కృష్ణ, కోశాధికారి చింతం వినయ్, ఆర్గనైజర్లు ఏసిరెడ్డి రంజిత్, ముడిదే రఘు తదితరులు పాల్గొన్నారు.


