ప్రజల పక్షాన కాకతీయ పత్రిక
అతి తక్కువ కాలంలోనే కాకతీయ న్యూస్‌కు ప్రత్యేక గుర్తింపు
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో ఖిలా వరంగల్ ఎమ్మార్వో ఇక్బాల్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ పత్రికా రంగంలో విశ్వాసాన్ని సంపాదించిన కాకతీయ న్యూస్ పేపర్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఇక్బాల్ మాట్లాడుతూ, దమ్మున్న పత్రికగా కాకతీయ న్యూస్ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును సాధించిందని ప్రశంసించారు. ప్రజల సమస్యలను నిష్పక్షంగా వెలుగులోకి తెచ్చే ధైర్యవంతమైన కథనాలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, సమాజ ఆశయాలకు అద్దం పడే వేదికగా కాకతీయ న్యూస్ కొనసాగుతోందని తహసీల్దార్ పేర్కొన్నారు. సామాజిక సమస్యలపై నిర్భయంగా స్పందించడం పత్రిక బలమని అన్నారు.
సంస్కృతి–చైతన్యానికి ప్రాధాన్యం
నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పనలో స్థానిక సంస్కృతి, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. ఖిలా వరంగల్ ప్రాంతానికి సంబంధించిన శాసన, పరిపాలన, అభివృద్ధి అంశాలపై మరింత బలమైన కథనాలతో ప్రజల ముందుకు రావాలని పత్రిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ న్యూస్ పేపర్ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్ రజిత, జూనియర్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.


