విశ్వసనీయ జర్నలిజానికి కాకతీయ కొత్త చిరునామా
వేగం–విశ్లేషణ–నిజాయితీకి నిదర్శనం
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
పాఠకుల నమ్మకాన్ని బలపరుస్తున్న పత్రిక
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ వేదికలపై వేగంగా దూసుకుపోతూ, సంచలనాత్మక కథనాలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న కాకతీయ దినపత్రిక విశ్వసనీయ జర్నలిజానికి ప్రతీకగా నిలుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశంసించారు. సోమవారం కరీంనగర్‌లో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ వేగవంతమైన వార్తలతో పాటు లోతైన విశ్లేషణను అందించడం ద్వారా పాఠకుల విశ్వాసాన్ని కాకతీయ మరింత బలపరుస్తోందని అన్నారు.
నిజాలే ఆయుధంగా ముందుకు
నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడం, ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారించడం, సమాజానికి అవసరమైన అంశాలను స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో కాకతీయ దినపత్రిక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. డిజిటల్ వేదికలపై విశేష స్పందన పొందుతూ వార్తల వేగం, విశ్వసనీయత, విషయ లోతు అనే మూడు అంశాలను సమన్వయంగా ముందుకు తీసుకెళ్తున్న తీరు అభినందనీయమని అన్నారు.భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలుస్తూ జర్నలిజంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో సాయి ముండ్రాతి, కరీంనగర్ ఆర్సీ వేణు రాచర్ల, బీజేపీ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


