కాకతీయ ఎఫెక్ట్…ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు
తహసిల్దార్ :రమేష్ బాబు
కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పెద్దగుట్ట శిఖము ఆక్రమణకు గురి చేస్తున్నారంటూ మండల కేంద్రానికి చెందిన రైతు తహసిల్దార్ కార్యాలయంలో గురువారం నాడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను కాకతీయ దినపత్రిక వెలుగులోకి “గుట్ట శిఖం ఆక్రమణ”అని ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే.

వెంటనే స్పందించిన రెవెన్యూ సిబ్బంది ఆక్రమిత ప్రభుత్వ భూమిని శనివారం రోజున తహశీల్దార్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ అఖిల్, సర్వేయర్ శ్రీనిత్య గుట్ట ప్రాంతానికి వెళ్లి పనులను నిలిపివేశారు.అనంతరం శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు మండల సర్వేయర్ శ్రీ నిత్య,గ్రామ పరిపాలన అధికారి యాఖుబ్ పాషా ట్రైనీ సరయర్ లు కలిసి సర్వే నెంబర్ 1192 విస్తీర్ణం ఎ. 4-37గుంటలు,సర్వే నెం.1193 విస్తీర్ణం 17-30గుంటలు గల పట్టా భూమి సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఆక్రమిత ప్రభుత్వ భూమిని వెలికితీసి రైతుల సమక్షంలో హద్దులు చూపించారు.అనంతరం తహశీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ పెద్దగుట్ట ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 1207 లో విస్తీర్ణం 198 ఎకరాలు రెవెన్యూ రికార్డు ప్రకారం వున్నదని అట్టి ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసర్వే లో సర్వేయర్ శ్రీ నిత్య,జిపిఓ యాఖుబ్ పాషా తో పాటు ట్రైనీ సర్వేయర్లు మహేష్,పవన్, హరీష్,ప్రసన్న,విఆర్ ఏ వెంకటనారాయణ,రైతులు వేల్పుల వెంకట్రాంనర్సయ్య, వనుకూరి వెంకటనర్సయ్య, సుంకరిచంద్రయ్య,వేముల విజయ్ కుమార్,వనుకూరి శ్రీనివాస్ రెడ్డి చుట్టు ప్రక్కల రైతులు తదితరులు పాల్గొన్నారు.


