epaper
Monday, March 2, 2026
epaper

కాకతీయ ఎఫెక్ట్…

కాకతీయ ఎఫెక్ట్…
స‌ర్పంచుల శిక్ష‌ణ‌లో భ‌ర్త‌లు బ‌య‌ట‌నే
ఆమె సర్పంచ్.. ఆయనకు శిక్షణ కథనంపై డీపీవో సీరియ‌స్‌
మహిళా సర్పంచ్‌ల స్థానంలో భర్తల హాజరుపై అధికారుల అప్రమత్తత
ఐడి కార్డు చూసి శిక్ష‌ణ‌కు అనుమ‌తించిన అధికారులు
పంచాయతీరాజ్ శాఖ‌ కమిషనర్ ఆదేశాలతో పకడ్బందీ చర్యలు
మూడో రోజు సజావుగా కొనసాగిన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం
సంచ‌ల‌నం రేపిన‌ కాక‌తీయ క‌థ‌నం

కాకతీయ, దుగ్గొండి : మహిళా సర్పంచ్‌లకు బదులుగా వారి భర్తలు శిక్షణకు హాజరవుతున్నారనే విషయం కాక‌తీయ‌ వెలుగులోకి తీసుకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహిళా ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఇతరులను అనుమతించకూడదని కఠిన చర్యలు చేపట్టారు. గంగదేవిపల్లి గ్రామంలో జరుగుతున్న ఐదు రోజుల శిక్షణా శిబిరంలో మూడో రోజు నుంచి కట్టుదిట్టమైన తనిఖీలు అమలు చేశారు. గేటు వద్దనే సర్పంచ్‌ల ఐడి కార్డు, ఆధార్ కార్డు పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించారు. సర్పంచ్‌లు తప్ప కుటుంబ సభ్యులు, ఇతరులకు ప్రవేశం నిరాకరించారు. దీంతో గతంలో నెలకొన్న పరిస్థితులకు పూర్తిగా చెక్ పడింది. మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు శిక్షణకు హాజరవుతున్నారనే విషయం వెలుగులోకి రావడంతో జిల్లా పంచాయతీ అధికారి తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా మందలించి, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేసినట్లు సమాచారం. శిక్షణా కార్యక్రమాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలతో అప్రమత్తం

ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం కూడా స్పందించినట్లు సమాచారం. మహిళా సర్పంచ్‌ల స్థానంలో ఇతరులు హాజరవడం సహించబోదని, బాధ్యులపై చర్యలు తప్పవని జిల్లా అధికారులకు సూచనలు అందినట్లు తెలిసింది. ఈ మేరకు శిక్షణా కేంద్రాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మహిళా సర్పంచ్‌లు స్వయంగా పాలన నిర్వహించేలా అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో మూడో రోజు శిక్షణా కార్యక్రమం సజావుగా కొనసాగింది. మహిళా సర్పంచ్‌లే ప్రత్యక్షంగా పాల్గొనడంతో శిక్షణ లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో ఇతరులు వ్యవహరించకుండా నిరోధించేందుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img