epaper
Tuesday, April 7, 2026
epaper

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..!
మారీచులపై టీజీఎండీసీ ఎండీ స్పంద‌న‌
బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2 అక్ర‌మాల‌పై ఎంక్వ‌యిరీకి భ‌వేశ్‌మిశ్రా ఆదేశం
లోడింగ్ చార్జీలు వ‌సూళ్ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని పీవో రామ‌కృష్ణ‌కు బాధ్య‌త‌లు
లారీ డ్రైవ‌ర్ ప్ర‌వీణ్ దాడి చేయ‌డంపైనా నివేదిక కోరిన ఐఏఎస్‌
ఆరోప‌ణ‌లు నిజ‌మైతే.. క్వారీని సీజ్ చేయాల‌ని ఆదేశాలు
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును ప‌ట్టించుకోని మ‌హ‌దేవ్‌పూర్‌ పోలీసులు
వీడియోలు..ఆధారాలు స‌మ‌ర్పించినా కేసు న‌మోదులో జాప్యం
క్వారీ ఓన‌ర్ విజేందర్‌రెడ్డికి స‌హ‌క‌రిస్తున్నారా..?
ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న పీవోతో విచార‌ణ సాధ్య‌మేనా..!?
లారీ డ్రైవ‌ర్ల‌కు, ఓన‌ర్ల‌కు న్యాయం జ‌రుగుతుందా..? వేధింపులు ఆగుతాయా..?
అన్ని సందేహాలే.. మ‌మ అనిపించ‌డ‌మే ల‌క్ష్య‌మా..
మ‌హ‌దేవ్‌పూర్ బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2 ఘ‌ట‌న‌లో క‌లుగుతున్న అనుమానాలు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం బ్రాహ్మణపల్లి క్వారీ-2లో వెలుగుచూసిన అక్రమాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కాకతీయలో మారీచులు అనేక కథనం సోమవారం పతాక శీర్షికన ప్రచురితం కావడంతో టీజీఎండీసీ ఎండి భ‌వేశ్‌మిశ్రా స్పందించారు. మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2లో ప్ర‌వీణ్ అనే డ్రైవ‌ర్‌పై ముగ్గురు క్వారీ సిబ్బంది దాడి చేసిన అంశంతో పాటు క్వారీలో లోడింగ్ పేరుతో 1700 వ‌సూలు చేయ‌డంపైనా ఎంక్వ‌యిరీ చేయాలంటూ పీవో రామ‌కృష్ణ‌ను ఎండీ భ‌వేశ్ మిశ్రా ఫోన్‌లో ఆదేశించారు. ఈమేర‌కు ఇదే విష‌యంపై ప్రాజెక్టు ఆఫీస‌ర్ రామ‌కృష్ణ‌ను కాక‌తీయ సంప్ర‌దించ‌గా.. ఎంక్వ‌యిరీకి ఆదేశించిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. దాడి ఘ‌ట‌న‌, వ‌సూళ్ల‌పై ఎండి ఎంక్వ‌యిరీకి ఆదేశించిన‌ట్లుగా ధ్రువీక‌రించారు.

ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో, మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో చ‌ర్చ‌..

కాక‌తీయ‌లో ప్ర‌చురిత‌మైన మారీచులు క‌థ‌నం ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో, మైనింగ్ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్న వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీశాయి. దీనికితో లారీ అసోసియేష‌న్ నాయ‌కులు కూడా కాక‌తీయ‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నాల‌ను ఆధారంగా చూపుతూ.. ఎండీ భ‌వేశ్‌మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. ఈ క‌థ‌నాలు, లారీ అసోసియేష‌న్ చూపిన వీడియో, ఇత‌ర ఆధారాల‌ను ప‌రిశీలించిన టీజీఎండీసీ ఎండీ విచార‌ణ‌కు ఆదేశించారు. అదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా న‌డుస్తున్న ఇసుక క్వారీల్లో లోడింగ్ పేరుతో డ్రైవ‌ర్లు, య‌జ‌మానుల నుంచి తీసుకుంటున్న అద‌న‌పు చార్జీల‌ను వెంట‌నే నియంత్రించాల‌ని ఎండీ అధికారుల‌ను ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

అక్ర‌మాలు తేలితే.. సీజ్ చేయండి..!

బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై పూర్తి స్థాయి నివేదిక కోరిన టీజీఎండీసీ ఎండీ భ‌వేశ్ మిశ్రా.. అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లుగా తేలితే క్వారీని సీజ్ చేయాల‌ని అధికారుల‌కు ఆదేశించిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. కాంట్రాక్ట‌ర్ అక్ర‌మాల‌ను పొత్స‌హించ‌వ‌ద్ద‌ని, లారీ ఓన‌ర్ల‌, డ్రైవ‌ర్ల‌ను వేధించ‌డం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ క్షేత్ర‌స్థాయి అధికారుల‌ను మంద‌లించిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో లోడింగ్ బిల్లుల చెల్లింపుల్లో కొంత ఆల‌స్యం జ‌రుగుతుండ‌టంతోనే క్వారీ కాంట్రాక్ట‌ర్ల ఆగ‌డాలు ఎక్కువువుతున్నాయ‌ని, దీన్ని అరిక‌ట్టాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. క్వారీలో జరుగుతున్న లోడింగ్ ఛార్జీల వసూళ్లు, లారీ డ్రైవర్లపై వేధింపులు, ఇటీవల చోటుచేసుకున్న దాడి ఘటనల నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2 ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీవో) రామకృష్ణకు బాధ్యతలు అప్పగించారు.

విచార‌ణ మ‌మ అనిపిస్తారా..? నిజాలు నిజంగా తేలుస్తారా.?

ఈ మొత్తం వ్యవహారంలో మహదేవ్‌పూర్ పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు ప్ర‌వీణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వీడియోలు, ఇతర ఆధారాలు సమర్పించినప్పటికీ కేసు నమోదు చేయడంలో జాప్యం ఎందుకు జరిగిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్వారీ యాజమాన్యానికి పోలీసులు మద్దతుగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్వారీ ఓనర్ విజేందర్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా విచారణ బాధ్యతలను అప్పగించిన పీవో రామకృష్ణపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఆయన ఆధ్వర్యంలో జరిగే ఎంక్వయిరీ ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉంటుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే విచారణ బాధ్యతల్లో పెట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనలతో లారీ డ్రైవర్లు, ఓనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజువారీ ఉపాధి కోసం కష్టపడుతున్న తమపై అధిక వసూళ్లు, బెదిరింపులు, దాడులు కొనసాగుతున్నాయని వారు వాపోతున్నారు. తక్షణమే ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం టీజీఎండీసీ ఎండీ ఆదేశాలతో విచారణ ప్రారంభం కానుండగా, నిజాలు వెలుగులోకి వస్తాయా..? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా..? లేక వ్యవహారం ‘మమ’ అనిపించడమే లక్ష్యమా..? అన్న అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కేసు తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు శంషాబాద్ టు కిమ్స్ ఆసుపత్రి గ్రీన్ ఛానెల్ ద్వారా...

బాసర ఆలయానికి మహర్దశ

బాసర ఆలయానికి మహర్దశ శృంగేరి పీఠం నుంచి అనుమ‌తులు వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా...

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి అభివృద్ది ప‌నుల్లో రాజీ ప‌డొద్దు టీటీడీ త‌ర‌హాలో ఏర్పాట్లు...

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం అడ్డంకులు తమవారికే కొలువులు...

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల...

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి?

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి? మంత్రిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా? పొంగులేటి మంత్రి పదవికి...

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక సేవ...

ఆత్మీయ అనుబంధాలు మాయం

ఆత్మీయ అనుబంధాలు మాయం మనుషుల మధ్య పెరుగుతున్న వైష‌మ్యాలు ప్రేమానురాగాల కంటే సంపాదనపైనే మోజు ఉమ్మ‌డి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img