ప్రజాస్వరానికి ప్రతిబింబంగా కాకతీయ దినపత్రిక
క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కాకతీయ, కరీంనగర్ : ప్రజా సమస్యలకు గొంతుకగా, సమాజ స్పృహను పెంపొందించే దినపత్రికగా కాకతీయ దినపత్రిక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో సోమవారం నాడు ఆయన కాకతీయ దినపత్రిక 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ. నిజాయితీతో కూడిన వార్తల ప్రచారం, ప్రజల పక్షాన నిలబడే ధోరణితో కాకతీయ దినపత్రిక ముందుకు సాగుతుందని ప్రశంసించారు. స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో కాకతీయ పాత్ర అభినందనీయమన్నారు.జిల్లాలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను సమతుల్యంగా ప్రజలకు చేరవేస్తూ విశ్వసనీయతను నిలుపుకుంటున్న పత్రికగా కాకతీయ దినపత్రిక ఎదుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత బలంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో సాయి, కరీంనగర్ ఆర్సి వేణు, బి ఆర్ ఎస్ రాజకీయ నాయకులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


