వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘కాకతీయ’
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
కాకతీయ, నర్సంపేట టౌన్ : ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, వాస్తవాలను ధైర్యంగా వెలుగులోకి తీసుకొస్తున్న దినపత్రికగా కాకతీయ ప్రజల మనసు గెలుచుకుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. ఆయన తన క్యాంప్ కార్యాలయంలో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అతి తక్కువ కాలంలోనే కాకతీయ దినపత్రిక పాఠకుల మన్ననలు పొందడం హర్షణీయమన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, సమస్యలపై నిజానిజాలను ప్రజలకు చేరవేయడంలో కాకతీయ ముందంజలో ఉందని ప్రశంసించారు. ‘ఎప్పటి వార్తలు అప్పుడే’ అన్న నినాదాన్ని ఆచరణలో పెట్టి నెంబర్‌వన్‌గా నిలిచిందని అభినందించారు. ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత చేరువ కావాలని యాజమాన్యానికి, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డి, సాంబయ్య గౌడ్, చెన్నారావుపేట మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధన రమేష్, లింగాపురం సర్పంచ్ రమేష్, పదహారు చింతల తండ సర్పంచ్ విక్రమ్, ఉప సర్పంచ్ రమేష్, డీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్ జాన్ నాయక్‌తో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


