ప్రజల గొంతుకగా కాకతీయ
విలువలతో కూడిన వార్తా ధోరణి అభినందనీయం
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రజా సమస్యలను నిబద్ధతతో వెలికి తీస్తూ, నిజాలను నిర్భయంగా రాస్తూ కాకతీయ దినపత్రిక ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ ప్రశంసించారు. ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవడంలో కాకతీయ దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజ హితాన్ని కేంద్రంగా చేసుకుని బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించడం కాకతీయ దినపత్రిక ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా, ధైర్యంగా అందిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నదని ప్రశంసించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను వినియోగించుకుంటూనే, విలువలు, నైతికతను కాపాడుకుంటూ కాకతీయ దినపత్రిక ముందుకు సాగాలని సూచించారు. ప్రజల సమస్యలపై మరింత బలమైన స్వరం వినిపిస్తూ ప్రజల గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కాకతీయ దినపత్రిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో సాయికిరణ్, కరీంనగర్ ఆర్‌సీ ఇన్‌చార్జ్ వేణు తదితరులు పాల్గొన్నారు.


