వాస్తవాలకు వేదికగా కాకతీయ
వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు
కాకతీయ, హుజురాబాద్ : ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుంటూ నిస్పక్షపాతత్వం, వాస్తవికత, బాధ్యతాయుత జర్నలిజంతో పత్రికా రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కాకతీయ దినపత్రిక సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తోందని హుజురాబాద్ వేకిల్ ఇన్‌స్పెక్టర్ కంచి వేణు అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజాక్షేత్రంలో కాకతీయ దినపత్రిక రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేకిల్ ఇన్‌స్పెక్టర్ కంచి వేణు మాట్లాడుతూ, ప్రాంతీయ సమస్యలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే బాధ్యతను కాకతీయ దినపత్రిక సమర్థంగా నిర్వర్తిస్తోందని కొనియాడారు. వార్తల ప్రదర్శనలో స్పష్టత, సమతుల్యత, నిజాయితీని పాటిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్థంభమని పేర్కొన్న ఆయన, ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తూ కాకతీయ దినపత్రిక మరింత బలోపేతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక హుజురాబాద్ రిపోర్టర్ శంకర్‌తో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


