సంచలన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ
ప్రజా సమస్యలకు అద్దం పడుతున్న పత్రిక కథనాలు
తక్కువ కాలంలోనే పాఠకుల మన్నన
విశ్వసనీయ పత్రికగా ప్రజల ఆదరణ
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంస
క్యాలెండర్ ఆవిష్కరించి యాజమాన్యానికి అభినందనలు
కాకతీయ, చేర్యాల : పత్రికలు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం చేర్యాల పట్టణంలో కాకతీయ దినపత్రిక నూతన సంవత్సర (2026) క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాకతీయ పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి వార్తా కథనం ప్రజల సమస్యలను కళ్లముందు జరిగినట్టుగా చూపిస్తోందని ప్రశంసించారు. కాకతీయ పత్రిక తన కథనాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంచలన వార్తా కథనాలకు కాకతీయ పత్రిక కేరాఫ్‌గా నిలుస్తోందని, నిజానిజాలను వెలికి తీసి సమాజానికి చేరవేయడంలో ఎప్పుడూ ముందుంటోందని అన్నారు. అతి తక్కువ కాలంలోనే కాకతీయ పత్రిక ప్రజలకు చేరువై, పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుందని కొనియాడారు. ఎప్పటికప్పుడు వార్తలను సేకరించి ప్రత్యేక ఎడిషన్లు, క్లిప్పింగ్స్‌ను ఆన్‌లైన్ ద్వారా పంపిస్తూ ప్రజలకు, అధికారులకు మరింత దగ్గరైందని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రజలు కాకతీయ పత్రికను విశ్వసనీయ దినపత్రికగా ఆదరిస్తున్నారని, తాను ప్రతిరోజూ కాకతీయ పత్రిక చదవుతుంటానని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కాకతీయ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఉడుముల భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, సిద్దిపేట జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు మెరుగు శ్రీనివాస్ గౌడ్, కొమురవెల్లి మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి కొమ్ము నర్సింగరావు, మాజీ కౌన్సిలర్ ఆడెపు నరేందర్, పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, మాజీ ఎంపిటిసి శ్రీధర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ చెవిటి లింగం, అల్లం శ్రీనివాస్, బూడిగే వెంకటేష్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా స్థాయి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకతీయ పత్రిక ప్రజా పక్షంగా నిలుస్తూ, నిజాలను ధైర్యంగా వెలుగులోకి తీసుకువస్తోందన్న అభిప్రాయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతల మాటల్లో వ్యక్తమైంది.


