ప్రజా–ప్రభుత్వాల మధ్య వారధిగా కాకతీయ
ఆర్కేపీ పట్టణ ఎస్సై శ్రీధర్
కాకతీయ, రామకృష్ణాపూర్ : కాకతీయ తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆర్కేపీ పట్టణ ఎస్సై శ్రీధర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కాకతీయ పత్రిక నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అవసరమైన సమగ్ర సమాచారం వేగంగా, నిజాయితీతో అందించడంలో పత్రిక ముందుండాలని సూచించారు. సమాజ హితానికి దోహదపడే వార్తలతో పాటు ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబించే కథనాలు ప్రచురిస్తూ విశ్వసనీయతను మరింత పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు.


