కాకతీయ.. ఒక శక్తి!
పత్రికారంగంలో ప్రభంజనం దిశగా అడుగులు
వరంగల్‌లో కాకతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రముఖులు
కాకతీయ, వరంగల్ : కాకతీయ పదంలోనే శక్తి దాగున్నదని, ఆ పేరుతో వెలువడుతున్న దినపత్రిక మెరుగైన సమాజ నిర్మాణానికి అక్షర యుద్ధం సాగిస్తున్నదని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్ర రెడ్డి, ఏనుమాముల మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం పేర్కొన్నారు. రానున్న కాలంలో కాకతీయ దినపత్రిక.. కాకతీయ సామ్రాజ్యంలా విస్తరించుకోవడంతోపాటు అజేయమైన కీర్తిని, పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు. గురువారం వరంగల్ నగరంలోని వారివారి కార్యాలయాల్లో కాకతీయ దినపత్రిక రూపొందించిన 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ.. రాతి అక్షరాలతో కూడుకున్న చరిత్ర అని, అలాంటి పేరుతో వెలువడుతున్న పత్రిక చరిత్ర సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. కాకతీయ సామ్రాజ్యంలా పత్రికా సామాజ్య్రాన్ని కాకతీయ పత్రిక ఏలాలని అభిలశించారు. కార్యక్రమంలో గ్రేడ్ 2 కార్యదర్శులు ఏ అంజిత్ రావు, శ్రీరామోజు రాము, ఏ ఎస్ రాజేందర్, అశోక్, సూపర్వైజర్లు శ్రీకాంత్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.



