కాకతీయ, ధర్మసాగర్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు కడియం శ్రీహరికి వింత నిరసన మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నప్పుడు తామంతా మీ గెలుపునకు ప్రచారంలో పాల్గొని విశేషంగా కృషి చేశాం.. మీరు మీ దారి చూసుకుంటూ మమ్మల్ని, పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా యూరియా కొరత రైతులు అరిగోస పడుతున్నారంటూ ధర్మసాగర్‌కు చెందిన బీఆర్ ఎస్ నేత లావుడ్యా ప్రవీణ్ నాయక్ కడియంకు లెటర్ రాశారు. మీరు మాకు ఇచ్చిన మాట నిలుపుకోలేదు.. రైతుల కష్టాలను తీర్చడం లేదు. మీరు మాట తప్పినందుకు వెంటనే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయండని పేర్కొంటూ కడియంకు ఉత్తరం రాశాడు.
ఈ ఉత్తరం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. మరి ఎమ్మెల్యే సార్ నుంచి ప్రవీణ్‌నాయక్‌కు రిప్లై ఉంటుందా..? అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.


