కాకతీయ, అమరావతి: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులపై అలిగింది. ప్రోటోకాల్ ప్రకారం తనకు కర్చీ వేయలేదని అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కడప పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవానికి ఆమె హాజరయ్యారు. తనకు వేదిక సమీపంలో ఎమ్మెల్యే ప్రొటోకాల్ ప్రకారం కుర్చీ వేయలేదని ఆమె అలిగారు. తనకు కేటాయించిన సీటులో అధికారులు కూర్చుకున్నారంటూ ఎమ్మెల్యే బుంగమూతి పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేసినా..మాధవి రెడ్డి దంపతులు మాత్రం అలకబూని అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.
కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


