కాకతీయ, గీసుకొండ: నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జ్యోతి పూజ ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువై ఉన్న సుప్రసిద్ధ శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు స్వామివారిని వైదిక మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించి, మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండల దీక్ష మాలలు వేసిన మొదటి మంగళవారం సందర్భంగా స్వామివారికి 12 జ్యోతులతో జ్యోతి పూజ ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య దంపతులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్ శ్రావ్య దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జ్యోతి పూజ అనంతరం మండల దీక్షలు చేపట్టిన స్వాములకు రణం భరత్ కుమార్ శ్రావ్య దంపతులు బీక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష, ఆలయ కమిటీ కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, కమిటీ సభ్యులు, స్వాములు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


