“చివరి వరకు న్యాయం గెలుస్తుంది”
* ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ
కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు,జరిగే చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నిక చివరి వరకు న్యాయం గెలుస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ తెలిపారు. మున్సిపాలిటీ చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నిక సందర్బంగా ప్రత్యేక ఇంచార్జ్ బాధ్యతలు పార్టీ అధిష్టానం అప్పగించిన నేపథ్యంలో క్యాతన్ పల్లికి వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకొని అనుమతించకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ విధులకు ఆటంకాలు కలిగించిన ఘటనలో కోవా లక్ష్మీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఆమె రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని ఇద్దరు షూరిటీలతో కలిసి సంతకం చేశారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికను హై కోర్టు ఆదేశాల మేరకు మూడు వారాల్లోగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్,అనిల్ రావు,ఓదెలు,మహేష్,రవీందర్ రెడ్డి,సంపత్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.


