కాకతీయ, జగిత్యాల: ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కారించడంతో పాటు పెండింగులో లేకుండా ఎప్పటకప్పుడు చర్యలు చేపడుతున్నామని జగిత్యాల జిల్లా ఏస్పీ ఆశోక్ కూమార్ తెలిపారు. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది అర్జీ దారులను జిల్లా ఏస్పీ స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం సంబంధిత శాఖ అధకారులతో చరవాణిలో మాట్లాడి ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఏస్పీ మాట్లడతూ.. భాదితుల నుండి వచ్చే ఫిర్యాదులను ఆన్‌లైన్ లో నమోదు చేస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా ఏస్పీ తెలిపారు.


