కాకతీయ, తెలంగాణ బ్యూరో: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ప్రకటించాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్ట్ బి. సుదర్శన్ రెడ్డి పేరును విపక్ష కూటమి నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు.
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని ఆకులమైలారం. 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా విద్యను అభ్యసించారు. 2005లో గుహవాటి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించారు. గోవా తొలి లోకాయుక్తగా పనిచేశారు.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాక్రిష్ణన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సీపీ రాధాక్రిష్ణన్, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ కొనసాగనుంది.


