గుండెపోటుతో జూనియర్ లైన్ మెన్ మృతి
కాకతీయ, నర్సంపేట: ఉద్యోగానికి వెళుతున్న క్రమంలో మార్గం మధ్యలో జూనియర్ లైన్ మెన్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రౌతు మహేందర్ అనే వ్యక్తి మహబూబాబాద్ లో విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం ఇంటి నుండి ఉద్యోగానికి వెళ్తూ మార్గం మధ్యలో గూడూరు నుండి మచ్చర్ల సమీపంలో ఛాతి లో నొప్పి వస్తుందని ఓ వ్యక్తి సహాయం ద్వారా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.


