కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ -2 ఫలితాలలో
కలెక్టరేట్ లో జూనియర్ అసిస్టెంట్ ప్రతిభ చూపి తొమ్మిదో ర్యాంకు కైవసం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన మేక ఉపేందర్ గ్రూపు -2 లో సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం సాధించారు, ఆయన ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లి దండ్రులు రమణమ్మ-రమణయ్యలు వ్యవసాయం చేస్తున్నారు. తమ కుమారుడు కష్టపడి చదివి ఉన్నతోద్యోగం సాధించడంపై ఆనందం వెలిబుచ్చారు. ఉపేందర్ ను గ్రామస్తులతో పాటు బంధువులు స్నేహితులు అభినందనలు తెలిపారు.
గ్రూప్స్ సాధించిన జూనియర్ అసిస్టెంట్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


