epaper
Thursday, January 15, 2026
epaper

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌

విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు

వరుస సెలవులు రావడంతో నగరవాసుల పల్లెబాట

కిట‌కిట‌లాడుతున్న బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు

హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 ప్ర‌త్యేక రైళ్లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో భాగ్యనగర పరిసర రహదారులన్నీ ట్రాఫిక్ జామ్‌తో కిటకిటలాడుతున్నాయి. నేడు రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో.. పండుగకు ముందే ప్రయాణికులు ఊర్లకు వెళ్తుండటమే ఈ రద్దీకి ప్రధాన కారణం. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై(NH-65) వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఓవైపు ఔటర్ రింగ్ రోడ్ వద్ద వాహనాలు బారులు తీరగా.. మరోవైపు పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచీ వెహికిల్స్ క్యూ కట్టాయి. పెద్ద కాపర్తి నుంచి వెలిమినేడు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఒక్కరోజే సుమారు 65 వేల వెహికిల్స్

సాధారణంగా.. పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రోజుకు సుమారు 35వేల నుంచి 40వేల వరకూ వాహన రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే.. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శ‌నివారం ఒక్కరోజే సుమారు 65 వేల వెహికిల్స్ ఆ మార్గంలో పరుగులు పెట్టాయి. ఇక.. నేడు ఈ రద్ధీ మరింత పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు టోల్‌ప్లాజా సిబ్బంది సహా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇంత పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ప్రధాన కారణాలు రోడ్డు ఇరుకుగా ఉండటం, సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరగడం. అదనంగా.. పెద్ద కాపర్తి దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులూ ట్రాఫిక్‌ను మరింత తీవ్రతరం చేశాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి రోడ్లు విస్తరించినప్పటికీ, పండుగ సీజన్ రద్దీ ముందు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.

ప్ర‌త్యేక రైళ్లు సిద్దం

సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే కొంచెంసేపటి క్రితం ప్రకటించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేయడం విశేషం. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. సంక్రాంతి పండుగ వేళ ఇప్పటికే నడుస్తున్న 150కిపైగా అదనపు ట్రైన్స్‌కు ఇవి అదనం. అయితే, ఇవాళ ప్రకటించిన ప్రత్యేక రైళ్లు.. కేవలం విజయవాడ వరకు మాత్రమే నడుపుతున్నారు.

దక్షిణ మధ్య రైల్వే శాఖ జాగ్రత్తలు

ఇప్పటికే నడుస్తున్న సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ మాత్రం నర్సాపురం, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, నాందేడ్‌ వరకూ నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్ల నిర్వహణ విషయంలోనూ దక్షిణ మధ్య రైల్వే శాఖ జాగ్రత్తలు తీసుకుంది. చాలా ట్రైన్స్‌ను చర్లపల్లి నుంచి బయల్దేరేలా షెడ్యూల్ చేసింది. దీంతో పునర్నిర్మాణంలో ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై భారం పడకుండా జాగ్రత్త పడింది. ఒక్క చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచే కాకుండా కొన్ని రైళ్లు బేగంపేట్, హైటెక్ సిటీ, లింగంపల్లి నుంచీ ఎక్కేలా ప్లాన్ చేసింది. ఇదిలా ఉంటే, సంక్రాంతి పండుగను ఆనందంగా తమ సొంత ఊర్లలో జరుపుకునేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో పల్లెలకు క్యూకడుతున్నారు. దీంతో టోల్ ప్లాజాలు, విజయవాడ వైపు వెళ్లే రోడ్లు ట్రాఫిక్ తో కిటకిటలాడుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

మేడారం జాత‌ర‌లో నా జోక్యంలేదు

మేడారం జాత‌ర‌లో నా జోక్యంలేదు పనులన్నీ సీతక్క, పొంగులేటి చూస్తున్నారు నేను నా శాఖ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img